కార్తీకమాసం సందర్భంగా దేశవ్యాప్తంగా శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. భక్తులు దీపాలు వెలిగిస్తూ.. హరహర మహాదేవ శంభోశంకర అంటూ భజనలు చేస్తున్నారు. కార్తీకదీపాలు వెలిగించేందుకు సాధరణంగా ఆవునెయ్యిగాని.. నువ్వులనూనె గాని ఉపయోగిస్తారు. కాని ఓ దేవాలయంలో అర్చక స్వామి దీపారాధనకు పెట్రోల్ ఉపయోగించాడు. అదెక్కడో కాదు.. మన తెలంగాణ.. నల్లగొండ జిల్లాలోనే.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నల్లగొండ జిల్లా నకిరేకల్ శివాలయంలో అపశృతి చోటు చేసుకుంది. అర్చకస్వాములుగర్భగుడిలో దీపారాధన చేయగా ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆలయ పూజారి దీక్షితులకు గాయాలయ్యాయి.. దీపారాధనకు నువ్వుల నూనె లేదా ఆవునెయ్యికు బదులుగా పెట్రోల్ ఉపయోగించాడు. దీంతో మంటలు చెలరేగి గర్భగుడిలో పొగ అలముకుంది. శివాలయం అర్చకులకు గాయాలు కాగా.. నకిరేకల్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గర్భగుడిని శుభ్రం చేసేందుకు పెట్రోల్ తీసుకువచ్చాడని సమాచారం అందుతుంది.